: శ్రీవారి సేవలో గవర్నర్ నరసింహన్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.