: చెన్నైలో నేడు నటి అంజలీదేవి అంత్యక్రియలు
అనారోగ్యంతో కన్నుమూసిన సినీ నటి అంజలీదేవి అంత్యక్రియలు ఈ రోజు చెన్నైలో జరగనున్నాయి. ఈ ఉదయమే అడయార్ లోని స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. ముందుగా సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బీసెంట్ నగర్ లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ నెల 12న తుదిశ్వాస విడిచిన అంజలి మృతదేహాన్ని అవయవదానం కోసం చెన్నై వడపళనిలోని శ్రీరామచంద్ర ఆసుపత్రికి తరలించారు. దాంతో, మూడు రోజుల పాటు అక్కడే ఆమె పార్థివదేహాన్ని ఉంచారు.