: 1.46 లక్షల కేసులు వెనక్కి
ఒకటి కాదు, రెండూ కాదు ఏకంగా ఒక లక్షా నలభై ఆరువేల కేసులను ఉపసంహరించుకోవాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇవేమంత ప్రభావవంతమైనవి కావని ఆ రాష్ట్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది. వీటిలో 40 వేల కేసులు ధర్నాలు, ఆందోళనలకు సంబంధించినవేనని ఒక అధికారి తెలిపారు. వీటిలో శిక్షలు మూడు నెలలకు మించి పడవన్నారు. చాలా సమయం వెచ్చించి, అన్నీ పరిశీలించాకే ఇన్ని కేసులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనివల్ల కోర్టులపై భారం తగ్గుతుందని అన్నారు.