: పార్టీ ఏ చర్య తీసుకున్నా అందుకు సిద్ధమే: ఏఏపీ ఎమ్మెల్యే బిన్నీ
పార్టీ తనపై ఎలాంటి చర్య తీసుకున్నా అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ అన్నారు. గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న ఆయన, నిన్న పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలు.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చడం లేదని, కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే.