: చిన్నారిపై మాజీ ఆర్మీ ఉద్యోగి అఘాయిత్యం


ఇంట్లో పని చేసేందుకు వచ్చిన 13 ఏళ్ల చిన్నారిపై 67 ఏళ్ళ మాజీ ఆర్మీ ఉద్యోగి జరిపిన అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా పరిధిలోని నాయుడుపేటలో చోటు చేసుకుంది. నిందితుడు బెంజిమెన్ ఆర్మీలో వంటవాడిగా పనిచేసి రిటైరయ్యాడు. అతడి ఇంట్లో పనిచేస్తున్న బాలికపై గత సంవత్సరం ఆగస్టు నెలలో రెండుసార్లు అత్యాచారం జరిపాడు. అయితే, బాధితురాలు కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. తనను తాడుతో కట్టేసి తనపై బెంజిమెన్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న నాయుడుపేట పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News