: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కుమారుడుకి కేన్సర్?


ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నాలుగేళ్ల కుమారుడు అయాన్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అయాన్ కి మూత్రపిండంలో కణితి ఉన్నట్టు వైద్యులు గుర్తించారని దర్శకుడు మహేశ్ భట్ తెలిపారు. ప్రస్తుతం కేన్సర్ తొలిదశలో ఉందని, శస్త్రచికిత్స చేసి కీమోథెరపీ చికిత్స ఇవ్వాలని వైద్యులు చెప్పినట్టు సమాచారం. షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న హష్మీ చికిత్స సమయంలో కుమారుని వద్ద ఉండేందుకు దాన్ని రద్దు చేసుకుని తిరిగి ముంబయి వస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News