: షాడో.. ఓ స్టయిలిష్ ఎంటర్ టెయినర్ అంటున్న డైరక్టర్
విక్టరీ వెంకటేష్ నూతన చిత్రం షాడో ఆడియో విడుదల కార్యక్రమం నేడు హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్, తాప్సీ, శ్రీకాంత్, నాగేంద్రబాబు, వీవీ వినాయక్, మలినేని గోపీ చంద్ తదితరులు హాజరయ్యారు.
థమన్ అందించిన సంగీతంతో ఈ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని మెగా బ్రదర్ నాగేంద్ర బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ తమకు సోదరుడి వరుస అని వెల్లడించారు. ఇక, షాడో దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ, ఈ సినిమాకు థమన్ తప్ప మరెవ్వరూ సంగీతం సమకూర్చలేమని భావించామని అందుకే అతనికి మ్యూజిక్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు.
వెంకటేష్ కెరీర్ లో ఓ స్టయిలిష్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కాగా, ఈ సినిమా థీమ్ సాంగ్ 'డీడబడో' గీతాన్ని వేదికై థమన్ తో కలిసి బాబా సెహగల్ ఆలపించడం అందరినీ అలరించింది.