: నరేంద్ర మోడీ రాముడై వస్తున్నాడు... కాసుకోండి: బీజేపీ


గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రావణ జాతికి చెందిన కాంగ్రెస్ వారిని ఓడించేందుకు మోడీ రాముడై వస్తున్నాడని ఆ పార్టీ అధికార ప్రతినిధి కుమార్ హైదరాబాదులో వ్యాఖ్యానించారు. మోడీని ఎదుర్కొనడానికి కాంగ్రెస్ సిద్ధమైతే.. ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. పాల్వాయి సహా ఇతర కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసే ముందు, తమ చరిత్రను గుర్తుంచుకొంటే మంచిదని ఆయన హితవు పలికారు.

నరేంద్ర మోడీ రాక్షస జాతికి చెందిన వ్యక్తి అని, వచ్చే ఎన్నికల్లో రాక్షస జాతి మోడీతో రాహుల్ యుద్ధం చేస్తారంటూ పాల్వాయి తీవ్ర విమర్శలు చేసిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News