: రోగులకు సేవలందిస్తూ.. స్విమ్స్ సరికొత్త రికార్డు


తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక వైద్యశాల అయిన శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) అరుదైన రికార్డును సాధించింది. 2013 సంవత్సరంలో సుమారు 3.50 లక్షలకు పైగా రోగులకు సేవలందించి ఈ రికార్డును సొంతం చేసుకొంది. ఇవాళ (బుధవారం) స్విమ్స్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మెడికల్ ఆఫీసర్ వివేకానంద ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాదిలో మొత్తం 3,54,759 మంది రోగులు చికిత్స చేయించుకోగా, వీరిలో 24,055 మంది ఇన్ పేషంట్లు అని ఆయన తెలిపారు.

స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ వివిధ విభాగ అధిపతులు, సిబ్బందిని అభినందించారు. స్విమ్స్ డాక్టర్లు, సిబ్బంది ఎప్పటిలా అంకితభావం, క్రమశిక్షణ, సేవాతత్వంతో పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. త్వరలోనే ఆసుపత్రి ఆవరణలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, ధ్యాన మందిరాలను ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News