: చలించిపోయిన అమీర్ ఖాన్... షూటింగ్ నిలిపివేత!


అమీర్ ఖాన్ చలించిపోయారు. ఆయన కళ్లవెంట నీరు వచ్చినంత పనైంది. అమీర్ వ్యాఖ్యాతగా సామాజిక సమస్యలను చూపించే 'సత్యమేవ జయతే' రెండవ సిరీస్ కోసం రెండు రోజుల క్రితం షూటింగ్ మొదలైంది. గతేడాది జరిగిన కొన్ని హింసాత్మక సంఘటనలకు సంబంధించి బాధితుల కథనాలను రికార్డు చేస్తున్నారు. వాటిని విన్న అమీర్ ఖాన్ భావోద్వేగాన్ని తట్టుకోలేక గంటసేపు షూటింగ్ ను ఆపివేయించారు. ఆయన మామూలు స్థితికి వచ్చాక మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News