: విమానం రద్దు చేయనేల.. ఫైన్ కట్టనేల!
ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థకు వినియోగదారుల ఫోరం జరిమానా వడ్డించింది. విమానాన్ని రద్దు చేసి ఇద్దరు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ, రూ. 50 వేల జరిమానా విధించింది. కేరళకు చెందిన ఓ తండ్రి, కూతురు ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించాల్సి ఉండగా, ఆ విమానాన్ని రద్దు చేసిన సదరు విమానయాన సంస్థ ఆ విషయాన్ని వారికి తెలపడంలో నిర్లక్ష్యం వహించింది.
దీంతో, ఆ తండ్రీకూతురు ప్రత్యామ్నాయం లేక తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారట. దీంతో వారు జాతీయ వినియోగదారులు వివాదాలు, నష్టపరిహారాల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారణ చేసిన సంఘం తాజా ఆదేశాలు జారీ చేసింది.
దీంతో, ఆ తండ్రీకూతురు ప్రత్యామ్నాయం లేక తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారట. దీంతో వారు జాతీయ వినియోగదారులు వివాదాలు, నష్టపరిహారాల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారణ చేసిన సంఘం తాజా ఆదేశాలు జారీ చేసింది.