: తగ్గనున్న పెట్రోల్ ధర
ఈ నెలలో రెండు సార్లు పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో లీటర్ పై రూ. 2.25వరకూ పెరిగింది. అనంతరం జరిగిన పరిణామాలతో పెరిగిన మేర ధర తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు కొంచెం తగ్గడం, అదే సమయంలో డాలర్ తో రూపాయి మారకం విలువ కొద్దిగా మెరుగుపడడంతో పెట్రోల్ ధర తగ్గనుంది. పెట్రోల్ పై తాము చాలా స్పల్ప మార్జిన్ ను చూసుకుంటున్నామని.. అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తామని ప్రభుత్వరంగ చమురు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. జనవరి 1న బ్యారెల్ క్రూడ్(119 లీటర్లు) 108 డాలర్లు ఉంటే అదిప్పుడు 104.77 డాలర్లకు తగ్గింది.