: టీ-బిల్లును మార్చే అధికారం సీఎంకు లేదు: మధుయాష్కీ


సీఎం కిరణ్ కుమార్ పై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఆరోపణలు కురిపించారు. ఇవాళ (బుధవారం) ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా మంత్రుల శాఖలను మార్చే అధికారం కిరణ్ కు ఉండవచ్చు.. కానీ తెలంగాణ బిల్లును మార్చే అధికారం మాత్రం లేదని యాష్కీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్ర విభజన జరిగి తీరుతుందని ఆయన జోస్యం చెప్పారు.

తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది.. వెనువెంటనే రాష్ట్రం ఏర్పాటవుతుందని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News