: పార్టీ పేరు చెప్పి బ్యాంకులకు టోపీ పెట్టారు: వీహెచ్
పార్టీ పేరు చెప్పి సీమాంధ్రలో కొందరు కాంగ్రెస్ నేతలు బ్యాంకులకు టోపీ పెట్టారని రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరావు అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. కొందరు నేతలు పార్టీ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేశారని, కోట్లు సంపాదించారని ఆరోపించారు. అలాంటి వారిని పార్టీకి దూరంగా పెట్టాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలని.. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న నేతలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ నెల 17 జరిగే ఏఐసీసీ సమావేశంలో తీర్మానం చేయాలని సోనియాను కోరారు.