: దేశానికి దమ్మున్న నేత కావాలి: మోడీ


దేశానికి దమ్మున్న, సామర్థ్యమున్న నేత కావాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అటువంటి సమర్థ నాయకత్వమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలదని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఈ రోజు జరిగిన ఫిక్కీ సమావేశంలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనుభవం, సమర్థత ఉన్న నాయకత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. దేశీయ పరిశ్రమకు అవకాశాల కొరత లేదని.. ప్రస్తుత అంధకారం నుంచి బయటపడాలని ఆశించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమల అభివృద్ధి తప్పనిసరన్నారు. ఈ విషయంలో నాయకత్వం ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకునే నాయకత్వం అవసరమని అన్నారు. పాట్నాలో పేలుళ్లు జరిగితే వేదిక వదిలి పారిపోలేదని.. తన ధైర్యవంతమైన నాయకత్వాన్ని మోడీ గుర్తు చేశారు. పేదల స్థితిగతులు మెరుగుపడకుండా సమగ్రాభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News