: హైదరాబాదు హాస్టల్ లో యువతులపై లైంగిక దాడి..!


హైదరాబాదు లేడీస్ హాస్టల్ లో దారుణం జరిగింది. నిన్న (మంగళవారం రాత్రి) బీహార్ యువతులపై హాస్టల్ నిర్వాహకుడు లైంగిక దాడికి దిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలోని సాయి మణికంఠ హాస్టల్ లో ఉంటున్న వారందరూ సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిపోయారు. అయితే, హాస్టల్ లో బీహార్ కు చెందిన ఐదుగురు యువతులు మాత్రమే ఉన్నారు. దీంతో పథకం ప్రకారం హాస్టల్ నిర్వాహకుడు నరేశ్ రాం తన స్నేహితులతో కలిసి లైంగిక దాడి చేశాడు. నరేశ్ రాం, అతని స్నేహితులు తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బాధితులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ అడిగి తెలుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News