: ఢిల్లీ సర్కారుపై ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే విమర్శలు
సొంత పార్టీ ఆమ్ ఆద్మీపై ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ మరోసారి అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలు.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చడం లేదన్నారు. ఈ మేరకు బిన్నీ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలతో గురువారం మరోసారి మీడియాతో మాట్లాడతానంటూ బాంబు పేల్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు లోగడ ఒకసారి బిన్నీ ఇలానే సంచలన వ్యాఖ్యలు చేశారు.