: జస్టిస్ స్వతంత్రకుమార్ లైంగిక వేధింపులపై కేంద్రానికి సుప్రీం నోటీసులు


లైంగిక వేధింపుల కేసులో జాతీయ హరిత ట్రైబ్యునల్ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ స్వతంత్రకుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వతంత్రకుమార్ తనను లైంగికంగా వేధించారని, తాకరాని చోట తాకారని.. గతంతో ఆయన వద్ద పనిచేసిన న్యాయ విద్యార్థిని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఈ రోజు విచారించిన సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, అటార్నీ జనరల్, జస్టిస్ స్వతంత్రకుమార్ లకు నోటీసులు జారీ చేసింది.

న్యాయమూర్తులపై వచ్చే లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారించేందుకు న్యాయవ్యవస్థలో ఒక యంత్రాంగం లేదని.. ఈ విషయంలో శాశ్వత పరిష్కారంతో రావాలని నోటీసుల్లో కోర్టు కోరింది. ఇందుకు ఫిబ్రవరి 14వరకు గడువిస్తూ కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే, ఎప్పుడో 2011లో లైంగిక వేధింపులు జరిగితే.. ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి గల కారణాలేంటని సుప్రీంకోర్టు బాధితురాలని ప్రశ్నించింది. ఈ కేసులో అమికస్ క్యూరీలుగా (కోర్టు సహాయకారులుగా) ఫాలీ ఎస్ నారిమన్, కె.వేణుగోపాల్ ను నియమించింది. సుప్రీంకోర్టు మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్ గంగూలీ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News