: న్యూమెక్సికో పాఠశాలలో గర్జించిన తుపాకీ


అమెరికాలో మరో విద్యార్థి ఉన్మాది అవతారం ఎత్తాడు. తోటి విద్యార్థులపై కాల్పుల వర్షం కురిపించాడు. న్యూమెక్సికో రాష్ట్రం, రాస్ వెల్ లో ఒక మిడిల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. 12 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి, ఒక విద్యార్థినికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టీచర్ వెంటనే స్పందించి ఉన్మాద విద్యార్థిని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయినట్లు తెలుస్తోంది. అమెరికాలోని స్కూళ్లలో విద్యార్థులు కాల్పులతో విరుచుకుపడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతుండడం ఆందోళనకరం.

  • Loading...

More Telugu News