: గుల్బర్గా ఎస్ఐ మృతి
రౌడీ షీటర్ మున్నా తో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుల్బర్గా ఎస్ఐ మల్లికార్జున బండె కన్నుమూశారు. ఈ నెల 8న కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో రౌడీషీటర్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో ఎస్ఐ తలలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు.