: రామ్ చరణ్ పై పోలీస్ కేసు
హీరో రామ్ చరణ్ పై పోలీస్ కేసు నమోదైంది. మొన్న విడుదలైన 'ఎవడు' సినిమాలో అశ్లీల సన్నివేశాలున్నాయంటూ ఈ సినిమాలో హీరోగా నటించిన చరణ్ పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హీరో రామ్ చరణ్, చిత్ర దర్శక నిర్మాతలు తదితరులపై ఐపీసీ 292 సెక్షన్ కింద ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.