: చలో హైదరాబాద్ పిలుపుపై మండిపడ్డ ఎర్రబెల్లి
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వడంపై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. అశోక్ బాబు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణవాదులందరూ ఏకమైతే హైదరాబాదులో ఎలా అడుగు పెడతారని ప్రశ్నించారు. ఈ రోజు ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడారు. టీబిల్లుపై చర్చకు సమయాన్ని పొడిగించరాదంటూ టీటీడీపీ ఫోరం తరఫున రాష్ట్రపతి ప్రణబ్ ను కలుస్తామని చెప్పారు.