: తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల ఆర్చ్ సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి ఒరిగిపోయింది. అయితే, ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.