: ఎయిర్ టెల్ నెత్తిన జరిమానా బండ!


నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ, భారత టెలికాం శాఖ ప్రముఖ మొబైల్ సేవల సంస్థ ఎయిర్ టెల్ కు రూ. 350 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. అనుమతి లేని ప్రాంతాల్లో 3జీ సేవలు అందిస్తున్నారని ఎయిర్ టెల్ ను టెలికాం శాఖ తప్పుబట్టింది. ఇతర సర్వీసు ప్రొవైడర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని దేశ వ్యాప్తంగా ఏడు సర్కిళ్లలో అక్రమంగా 3జీ సేవలు అందిస్తున్నారని టెలికాం శాఖ ఆరోపించింది.

అంతేగాకుండా తక్షణమే తన పరిధికి వెలుపల  ఈ సేవలను నిలిపివేయాలని టెలికాం శాఖ..  ఎయిర్ టెల్ ను ఆదేశించింది. గత ఏడాది ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్ సంస్థలను అనుమతి లేని ప్రాంతాల్లో 3జీ సేవలు నిలిపివేయాలని కేంద్రం  కోరింది. అంతేగాకుండా ఇలాంటి ఒప్పందాలు అక్రమమని పేర్కొంది. 

  • Loading...

More Telugu News