: పండగ పూట.. ఉసురు తీసిన కొబ్బరి చెట్టు


కొబ్బరి చెట్టు విరిగి పడి.. ఓ ఉపాధ్యాయుడి ఉసురు తీసింది. పండగ పూట ఆ ఇంట విషాదాన్ని నింపింది. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం దొమ్మేరులో కోలా శ్రీనివాసరావు (45) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామమైన ఆచంట గ్రామానికి వచ్చాడు. సోమవారం ఆచంట కచేరీ సెంటరుకు బైక్ పై వెళుతుండగా గ్రామ చావిడిలోని కొబ్బరి చెట్టు విరిగి మీద పడటంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఆయన మరణవార్తతో గ్రామంలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News