: పాస్టర్ హత్య కేసును సమీక్షించిన సీఎం
గత శుక్రవారం వికారాబాద్ లో సియోన్ చర్చి పాస్టర్ గా పనిచేస్తున్న సంజీవయ్యను ముగ్గురు వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచారు. ఆయనను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ కేసును సీఎం కిరణ్ ఈ రోజు సమీక్షించారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ ప్రసాదరావుని ఆదేశించారు. హత్యలో ఏదైనా కుట్ర దాగుందేమో అన్న సందేహాలు వ్యక్తం చేశారు.