: పెద్ద బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం: రాహుల్
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లే నిర్ణయాలు తీసుకుంటారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తానొక సిపాయినని, పార్టీ ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా శిరసావహిస్తానని చెప్పారు. ఓ హిందీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ విషయాలను స్పష్టం చేశారు. పెద్ద బాధ్యతలను చేపట్టడానికి తాను భయపడటం లేదని చెప్పారు. శుక్రవారం జరిగే ఏఐసీసీ సమావేశంలో రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.