: బాలిక జననాంగాల్లో మిరపకాయలు పెట్టి హింసించిన రాక్షసులు
మృగాలలో జాలి, కరుణ ఎంత వెతికినా కనిపించవు. మానవుల రూపంలో ఉన్న ఒక ఆడ, ఒక మగ మృగం తమ ఇంట్లో పని చేసే 11ఏళ్ల చిన్నారిని అతి క్రూరంగా, దారుణంగా హింసించారు. మాలో ఎంత వెతికినా మానవత్వం మచ్చుకైనా కనిపించదనే రీతిలో ప్రవర్తించారు. తమ ఆదేశాలు పాటించలేదన్న కోపంతో బాలికకు రోజుల తరబడి అన్నం పెట్టలేదు. పచ్చి మిరపకాయలు తినిపించి రాక్షసానందం పొందారు.
అంతటితోనూ ఆగలేదు. ఆ బాలిక జననాంగంలో పచ్చిమిరపకాయలు పెట్టారు. ఆమె బాధనుంచి పైశాచికానందం పొందారు. ఆ రెండు మానవ మృగాలే సర్జిల్ అన్సారీ(36), పర్హత్ అన్సారీ(32). మహారాష్ట్రలోని థానేలో ఈ రాక్షస దంపతుల హింసను తట్టుకోలేకపోయిన చిన్నారి పొరుగువారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. తనను హింసించిన తీరును వివరించి ఘొల్లుమంది. పోలీసులు వెంటనే సర్జిల్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. ఈ నెల 21 వరకు నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. ఇతడి భార్య పర్హత్ మాత్రం పరారీలో ఉంది.