: కుక్క కారు తోలితే...?
యజమాని కారులో రాజాలా కూర్చోక.. చిలిపిపని చేసిందో శునకం. జాసన్ మార్టినెజ్ కారులో మార్కెట్ కు వెళ్లాడు. ఒక షాపు దగ్గర కారాపి లోపలకు వెళ్లాడు. పెంపుడు శునకం కారులోనే ఉంది. కానీ, అది అలా ఊరకే కూర్చోలేదు. ఒక రౌండ్ వేద్దామనుకుంది! ఇంజన్ స్టార్ట్ చేసే ఉండడంతో గేరు మార్చింది స్టీరింగ్ పై రెండు కాళ్లు ఉంచి కారును పరుగులు పెట్టించింది. కంట్రోల్ చేయాలని దానికేం తెలుసు? ఏదో విగ్రహంలా అలా నిల్చుని ఉంది. అంతే, అడ్డంగా వచ్చిన వాళ్లను గుద్దుకుంటూ వెళ్లి కారు ఒక చోట ఆగింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్రవాహనం దెబ్బతినగా.. దానిపై ఉన్న మహిళ గాయాలతో బయటపడింది. కుక్క కారు తోలుతుంటే నమ్మలేకపోయానని ఆ మహిళ పేర్కొంది.