: భారత్ కు మూడు విగ్రహాలు అప్పగించిన అమెరికా


దౌత్య సంబంధాల పునరుద్ధరణ చర్యల్లో భాగంగా అమెరికా భారత్ కు మూడు రాతి విగ్రహాలను అప్పగించింది. భారత్ కు చెందిన ఈ విగ్రహాలు చోరీకి గురై అమెరికా చేరాయి. వాటి విలువ 9.30కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బుద్ధుడి విగ్రహాలను వాషింగ్టన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత దౌత్యాధికారులకు అమెరికన్ అధికారులు అందించారు. భారత దౌత్యాధికారిణి దేవయానిపై కేసు దాఖలు తర్వాత జరిగిన పరిణామాలు ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News