: టీమిండియా కోచ్ ఫ్లెచర్ కాంట్రాక్టు ఏడాది పొడిగింపు


భారత క్రికెట్ కోచ్ డంకన్ ఫ్లెచర్ పదవిని మరో ఏడాది పొడిగించారు. వాస్తవానికి ఫ్లెచర్ కాంట్రాక్టు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఫ్లెచర్ భారత జట్టు కోచ్ గా పెద్దగా విజయాలేవీ నమోదు చేసుకోలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై దారుణ పరాభవాలు, సొంతగడ్డపైనా భారత్.. ఇంగ్లండ్ చేతిలో టెస్టుల్లో చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఫ్లెచర్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, కాంట్రాక్టు పొడిగించాలన్న బీసీసీఐ నిర్ణయంతో అవన్నీ పటాపంచలయ్యాయి. 

  • Loading...

More Telugu News