: బీజేపీతో పొత్తు టీడీపీకి మంచిది కాదు: సీపీఐ నారాయణ
రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి మంచిది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు. తెలంగాణ బిల్లును భోగిమంటల్లో తగలబెట్టడం మంచిది కాదని... ఇలా చేస్తే విభజనకు మరింత సహకారం అందించినట్టేనని చెప్పారు. సీమాంధ్ర నేతలు రాజకీల లబ్ధి కోసం పాకులాడుతున్నారే తప్ప... సమైక్యం కోసం నిజంగా పోరాడటం లేదని అన్నారు. ఈ రోజు ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు.