: కర్నూలు రాజధానిగా చేస్తే రూ.500 కోట్లు రాసిస్తా: బాల సాయిబాబా
కర్నూలులో బాల సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జన్మదినాన్ని పురస్కరించుకొని భక్తులకు బాబా సందేశం ఇచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రం కలిసున్నా, విడిపోయినా ఎవరికేది ప్రాప్తమో అది దక్కుతుందని భక్తులకు చెప్పారు. విభజన జరిగితే.. హైదరాబాదుతో పాటు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలు పాలనా సౌలభ్యం కోసం అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. కర్నూలును రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తే.. తన 500 కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వ పరం చేస్తానని బాల సాయిబాబా ప్రకటించారు.