: కోడిపందేల వద్ద కాంగ్రెస్, వైకాపా ఘర్షణ
రాజకీయ పార్టీల మధ్య గొడవలు కోడిపందేల వరకూ పాకాయి. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం వాడపల్లిలో కోడిపందేల స్థావరం వద్ద కాంగ్రెస్, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు.