: గర్భాశయాన్నీ అమర్చవచ్చు..!


స్వీడన్ వైద్యులు చేపట్టిన మహిళల్లో గర్భాశయ మార్పిడి ప్రాజెక్టు సక్సెస్ అయింది. తొమ్మిది మంది మహిళలకు వారు విజయవంతంగా గర్భాశయాన్ని అమర్చారు. గర్భం దాల్చేందుకు వీరు ప్రయత్నిస్తారని... ప్రాజెక్టులో పాలుపంచుకున్న వైద్యులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న మహిళలు గర్భాశయం లేకుండా జన్మించడమో లేక క్యాన్సర్ ద్వారా దాన్ని కోల్పోవడమో జరిగినవారు. వీరంతా కూడా 30లలో ఉన్నవారు.

గతంలో కూడా సౌదీ అరేబియా, టర్కీలలో ఈ రకమైన ప్రయోగాలు జరిగాయి. అయితే ప్రయోగంలో పాలుపంచుకున్న వారికి సంతానయోగ్యం కలగలేదు. అమెరికా, బ్రిటన్, హంగేరీల్లో కూడా ఈ రకమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఈ దేశాలకంటే అత్యాధునికమైన పద్ధతుల్లో స్వీడన్ వైద్యులు ప్రయోగాలు చేపట్టి, విజయవంతమయ్యారు. గోథెన్ బర్గ్ యూనివర్శిటీకి చెందిన మాట్స్ బ్రాన్ స్ట్రామ్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ ప్రాజెక్టును నిర్వహించింది. ఇప్పటిదాకా శరీరంలోని ముఖం, కాలేయం, చేతులు తదితర భాగాల మార్పిడి జరుగుతున్నా... గర్భాశయ మార్పిడి మాత్రం పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు.

  • Loading...

More Telugu News