: రొమ్ము క్యాన్సర్ కు ఇకపై భయపడాల్సిన అవసరం లేదు
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకర వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అగ్రరాజ్యం అమెరికా కూడా దీని పీడితురాలే. రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ద్వారా చికిత్స చేస్తారు. వీటి ద్వారా వ్యాధిని నయం చేయవచ్చు. అయితే, ఈ పద్ధతుల్లో క్యాన్సర్ సోకిన కణజాలంతో పాటు, ఆరోగ్యవంతమైన కణజాలం కూడా దెబ్బతింటుంది. దీనిపై ఎన్నో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు కొత్త చికిత్స పద్ధతిని కనుగొన్నారు. ఈ వ్యాధి రావడానికి హెచ్ఓఎక్స్ఏ-1 అనే జన్యువే కారణమని నిర్ధారించిన శాస్త్రవేత్తలు... ఈ జన్యువును నియంత్రించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చని చెబుతున్నారు. వ్యాధి సోకిన తర్వాత కాకుండా, ముందుగానే ఈ మహమ్మారి బారిన పడే అవకాశం ఉన్న వారిలో... జన్యువును నియంత్రించడం ద్వారా వారిని రొమ్ము క్యాన్సర్ కు దూరంగా ఉంచవచ్చని తెలిపారు.