: కిల్లి కృపారాణికి సమైక్య సెగ
కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. కర్నూలులో కృపారాణి బస చేసిన ప్రభుత్వ అతిథి గృహాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. అతిథి గృహం నుంచి ఆమె బయటకు రాకుండా అడ్డుకుని.. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. బాలసాయిబాబా పుట్టినరోజు వేడుకలకు హాజరయేందుకు మంత్రి కృపారాణి కర్నూలుకు వచ్చారు.