: మతిమరుపా?... అయితే ఓ కప్పు కాఫీ తీసుకోండి!


మూడ్ ఎలా ఉన్నా.. సీజన్ ఏదైనా.. ఓ కప్పు కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. అదిచ్చే ఎనర్జీయే వేరు! అయితే కాఫీలో ఉండే కెఫీన్ మన మెదడు సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. కొత్త జ్ఞాపకాలను పదిలపరచుకునే సామర్థ్యాన్ని కెఫీన్ పెంచుతుందని తమ పరిశోధనల్లో తేలినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకసారి కాఫీ తాగితే దాని ప్రభావం మన మెదడుపై కనీసం 24 గంటల పాటు ఉంటుందని స్పష్టం చేశారు.

తమ పరిశోధనలకు శాస్త్రవేత్తలు కాఫీ తాగడం అలవాటు లేని వారిని ఎంచుకున్నారు. వీరి లాలాజలం నమూనాలను సేకరించి... అందులో కెఫీన్ పరిమాణాన్ని కనుగొన్నారు. అనంతరం వీరికి కొన్ని రకాల చిత్రాలను వరుసగా చూపారు. అయిదు నిమిషాల తర్వాత వారికి 200 మిల్లీ గ్రాముల కెఫీన్ మాత్రలను ఇచ్చారు. తర్వాత వీరి లాలాజలంలో కెఫీన్ పరిమాణాన్ని మళ్లీ విశ్లేషించారు. మాత్రలు వేసుకున్న తర్వాత, వారు అంతకు ముందు చూసిన చిత్రాలను వివరించాల్సిందిగా కోరారు. కెఫీన్ తీసుకున్న వారు అంతకు ముందు చూసిన చిత్రాలను చాలా కచ్చితత్వంతో గుర్తించగలిగారు. చూశారా, ఫ్రెండ్స్... కాఫీ తాగితే మన మెదడు ఎంత యాక్టివ్ గా పనిచేస్తుందో! ఇక లేటెందుకు? వెళ్లి ఓ కప్పు కాఫీ తాగండి!

  • Loading...

More Telugu News