: కార్పొరేషన్ లో ఓటరు జాబితా సమీక్ష
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) అదనపు కమిషనర్ పులి శ్రీనివాసులు ఓటర్ల జాబితాను సోమవారం సమీక్షించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్ల జాబితా పర్యవేక్షించే కార్పొరేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరినీ ఒకే పోలింగ్ బూత్ లో ఓటేసే విధంగా చూస్తామని అదనపు కమిషనర్ చెప్పారు. కార్పొరేషన్ నివేదికల ప్రకారం సుమారు 260 మంది వ్యక్తులు మరణించినట్లు ఆయన తెలిపారు. వారి పేర్లను సుమోటోగా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని శ్రీనివాసులు వెల్లడించారు. ఓటరు జాబితా పరిశీలన ఈ నెల 17వ తేదీతో ముగుస్తుందని, రాజకీయ పార్టీలు ఏదైనా వివరణ ఇవ్వాలంటే జీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ను సంప్రదించవచ్చని ఆయన చెప్పారు.