: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ నెల 21న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 16 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 7న ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏప్రిల్ 4వ తేదీతో 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 28వ తేదీ వరకు గడువిచ్చారు. 29వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 31. ఫిబ్రవరి 7న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిచేస్తారు.