: రైల్వే స్టేషన్ లో సూట్ కేస్ కలకలం
వరంగల్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఓ సూట్ కేసు కలకలం సృష్టించింది. ఎంతసేపటికీ దాన్ని ఎవరూ తీసుకోకపోయేసరికి ప్రయాణికులు హడలిపోయారు. సూట్ కేసులో బాంబ్ ఉందేమోనని భయపడిపోయారు. ప్రయాణికుల సమాచారంతో రైల్వేస్టేషన్ కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. సూట్ కేసులో బాంబు లేదని తేల్చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.