: అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ కు ప్రధాని శంకుస్థాపన
దేశంలో నిర్మించతలపెట్టిన అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ కు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. 2,800 మెగావాట్ల అణు విద్యుత్ లక్ష్యంగా హర్యానాలోని ఫతేబాద్ జిల్లా గోరక్ పూర్ గ్రామంలో ఈ ప్లాంటు నిర్మించనున్నారు. రూ.23,502 కోట్ల వ్యయంతో 1500 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టును... రెండు దశల్లో పూర్తి చేస్తారు.