: అంజలీదేవి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
అలనాటి మేటి నటి, వెండితెర సీతగా పేరొందిన అంజలీదేవి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చిరంజీవి, తమిళనాడు గవర్నర్ రోశయ్య సంతాపం ప్రకటించారు. తమిళనాడు సీఎం జయలలిత, డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి అంజలీదేవి ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.