: 15 నుంచి గవర్నర్ నరసింహన్ తిరుమల పర్యటన
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ నెల 15వ తేదీ నుంచి తిరుపతి, తిరుమలలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ వివరాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ వెల్లడించారు. గవర్నర్ 15వ తేదీ, బుధవారం మధ్యాహ్నానికి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఆయన తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. బుధవారం సాయంత్రానికి ఆయన తిరుమలకు చేరుకుంటారు. 16వ తేదీన (గురువారం) నరసింహన్ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం గురువారం మధ్యాహ్నం గవర్నర్ హైదరాబాదుకి బయల్దేరుతారని కలెక్టర్ తెలిపారు.