: కనిమొళి, రాజాలపై ఈడీ ఛార్జిషీట్
డీఎంకే అధినేత కరుణానిధి ముద్దుల తనయ కనిమొళి, మాజీ టెలికాంశాఖ మంత్రి ఎ.రాజాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సిద్ధమైంది. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో వీరిద్దరిపై ఛార్జిషీటు దాఖలు కానుంది. దీనికి సంబంధించి అటార్నీ జనరల్ ఇ.వాహనవతి ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం ఛార్జిషీట్ న్యాయశాఖ వద్ద ఉంది. న్యాయశాఖ నుంచి ఆమోదం లభించిన వెంటనే వీరిపై ఛార్జిషీటు ధాఖలవుతుంది. ఈ కేసులో దాదాపు రూ. 200 కోట్ల మొత్తాన్ని వీరు తమ కలైంగర్ టీవీలోకి మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి.