: 'రాయల్ లాడ్జి' హత్యల కేసులో నలుగురికి శిక్ష ఖరారు
ఓ కుటుంబం హత్య కేసును విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. నలుగురికి శిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుల్లో ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి ఏడేళ్ల శిక్షను విధించారు. 2009 ఆగస్టులో సికింద్రాబాదులోని రాక్ రాయల్ లాడ్జిలో ఎన్నారై ప్రసాద్, అతని భార్య విజయలక్ష్మి, కూతురు కవిత, కొడుకు కేతన్ దారుణహత్యకు గురయ్యారు. ప్రసాద్ కుటుంబం హత్య కేసులో వారి బంధువులు మాధవి, ఆమె భర్త అబ్రహంలకు జీవిత ఖైదు విధించారు. హత్యకు సహకరించిన క్రాంతి, ప్రదీప్ లకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ హత్యకు ఆస్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే కారణమని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది.