: అవయవ దానం చేసిన అంజలీదేవి
అలనాటి మేటి నటి అంజలీదేవి (86) ఈరోజు మధ్యాహ్నం చెన్నైలో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అంజలీదేవి అవయవ దానం చేసి తన మంచితనాన్ని చాటుకున్నారు. అంజలీదేవి భౌతిక కాయాన్ని చెన్నై విజయా ఆసుపత్రి నుంచి రామచంద్ర ఆస్పత్రికి తరలించారు. అవయవ దానం నిమిత్తం ఈరోజు, రేపు ఆమె భౌతిక కాయాన్ని రామచంద్ర ఆసుపత్రిలో ఉంచనున్నారు. ఆమె పార్థివ దేహాన్ని బుధవారం స్వగృహానికి తరలించనున్నారు. అదే రోజు అంజలీదేవి అంత్యక్రియలు చెన్నైలో జరుగనున్నాయి.