: శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం
సంక్రాంతి సంబరాలు హైదరాబాద్ శిల్పారామంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో శిల్పారామానికి సందర్శకుల తాకిడి పెరిగింది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. శిల్పారామం సంక్రాంతి సంబరాలతో నగర వాసులు ఆనందంలో తేలియాడుతున్నారు.