: మాజీ న్యాయమూర్తి లైంగిక వేధింపులపై సుప్రీంలో పిటిషన్


సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ హరిత ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ పై న్యాయవిద్యార్థిని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2011లో జస్టిస్ స్వతంత్రకుమార్ వద్ద పనిచేస్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తాకరాని చోట తాకారని పేర్కొంది. తన ఫిర్యాదుపై విచారణ జరపడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపై సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది. ఈ ఆరోపణలను జస్టిస్ స్వతంత్రకుమార్ ఇప్పటికే ఖండించారు.

  • Loading...

More Telugu News