: అసెంబ్లీలో 'దేవుడు'.. రగడ!
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరోజు అసెంబ్లీలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డిని పలుమార్లు దోపిడీదారుడని పేర్కొన్నారు. వైఎస్.. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారని మోత్కుపల్లి ఆవేశంతో ప్రసంగించారు.
ఓ సందర్భంలో బైబిల్ లోని ఓ వాక్యాన్ని మోత్కుపల్లి ఉదహరించడం వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను ఆగ్రహానికి గురిచేసింది. వెంటనే ఆమె అందుకుని అసెంబ్లీలోకి దేవుణ్ణి ఎందుకు లాగుతారని ప్రశ్నించింది. అంతకుముందు మోత్కుపల్లి.. కొడుకు దుర్మార్గుడైనా, ఏ తల్లయినా కాపాడుకునేందుకే ప్రయత్నిస్తుందని అనడంతో విజయమ్మ ఉక్రోషంతో ఊగిపోయారు.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, దేవుణ్ణి, బైబిల్ ను ఎందుకు అసెంబ్లీలోకి లాగుతారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు సభ్యత లేదని విమర్శించారు. దీంతో, మోత్కుపల్లి ప్రతిస్పందిస్తూ తాను కూడా బైబిల్ చదువుతానని అన్నారు. బైబిల్ అందరిదీ అని ఆయన నొక్కి చెప్పారు.